నెరవేరిన భువనగిరి రైతుల దశాబ్దాల కల..!

కలం, భువనగిరి : భువనగిరి (Bhuvanagiri ) నియోజకవర్గ రైతాంగం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కల ఎట్టకేలకు సాకారమైంది. వలిగొండ మండల పరిధిలోని సంగెం-ధర్మారెడ్డిపల్లి కాలువలోకి భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంలతో కలిసి మంగళవారం సాగునీటిని అధికారికంగా విడుదల చేశారు. నీటి విడుదలకు ముందు కాలువ వద్ద నాయకులు, అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. దాదాపు రూ.125 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ధర్మారెడ్డిపల్లి కాలువ నిర్మాణ పనులను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 16 నెలల్లోనే సగానికి పైగా పూర్తి చేసి, రైతులకు సాగునీరు అందించే స్థాయికి తీసుకువచ్చినట్లు తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరు నాటికి కాలువ నిర్మాణాన్ని పూర్తిస్థాయిలో ముగించి, నియోజకవర్గ రైతులకు శాశ్వతంగా సాగునీటిని అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. కాలువ పనులు పూర్తయితే వేలాది ఎకరాలకు సాగునీరు అంది, పంట దిగుబడి పెరగడమే కాకుండా రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగవుతుందని ధీమా వ్యక్తం చేశారు.

రైతు సంక్షేమానికి ప్రాధాన్యం: ప్రభుత్వ విప్

ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ‘ధర్మారెడ్డిపల్లి కాలువలోకి నీటిని విడుదల చేయడంతో ఈ ప్రాంత రైతాంగం చిరకాల నిరీక్షణకు తెరపడింది. ఈ ప్రాజెక్టు పూర్తిగా అందుబాటులోకి వస్తే ఈ ప్రాంతమంతా పచ్చని పైర్లతో సస్యశ్యామలంగా మారుతుందని చెప్పుకొచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>