తూప్రాన్‌లో అర్హత లేకుండానే 15 ఏళ్లుగా వైద్యం.. ప్రథమ చికిత్సా కేంద్రం సీజ్

కలం, మెదక్ బ్యూరో: ఎటువంటి ప్రామాణిక అర్హతలు లేకుండా 15 ఏళ్లుగా వైద్యం అందిస్తున్న నకిలీ డాక్టర్ గుట్టురట్టు చేశారు మెదక్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారులు. మెదక్ (Medak) జిల్లా తూప్రాన్ (Tupran) పట్టణంలోని శ్రీ భవాని ప్రథమ చికిత్సాలయంపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారులు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. తనిఖీల్లో భాగాంగా.. సలీలా అనే మహిళ ఎలాంటి అర్హత లేకున్న అక్రమ ప్రాక్టీస్‌ను చేస్తునట్టు అధికారులు గుర్తించారు.

సలీలా కేవలం GNM కోర్సు మాత్రమే పూర్తి చేసిందని, డాక్టర్‌గా వైద్యం చేసేందుకు డిప్యూటీ DM&HO డాక్టర్ అనిల్ రెడ్డి నుండి ఎలాంటి అనుమతులు పొందలేదని అధికారులు తెలిపారు. ఏ అర్హత లేకపోయినప్పటికీ డాక్టర్‌గా చెలామణి అవుతూ గత 15 సంవత్సరాలుగా వైద్య ప్రాక్టీస్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. సలీలా గతం నుండి ప్రసవాలు, అనైతిక అబార్షన్లు కూడా చేస్తున్నట్లు ఆమె వద్ద ఉన్న పాత రికార్డుల ద్వారా వెల్లడైందని అధికారులు స్పష్టం చేశారు.

ప్రథమ చికిత్సకు మించి పూర్తిస్థాయి డాక్టర్‌గా రోగులకు యాంటీబయోటిక్స్, ఇంజెక్షన్లు ఇస్తూ, బీపీ తనిఖీలతో పాటు గమనించినట్లు పేర్కొన్నారు. అనర్హులైన వ్యక్తులు వైద్యం పేరిట అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే ఉపేక్షించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. ముఖ్యంగా అక్రమ అబార్షన్ల వల్ల లింగ నిష్పత్తి క్షీణించే ప్రమాదం ఉందని, ఇటువంటి చర్యల వల్ల సమాజానికి తీరని నష్టం జరుగుతుందని అన్నారు. ఈ నకిలీ డాక్టర్ సలీల విషయమై ఉన్నతాధికారులు, రెవెన్యూ మరియు పోలీసు శాఖలకు సమాచారం అందించి సదరు ఆసుపత్రిని సీజ్ చేసి, చట్టపరమైన తగిన చర్యలు తీసుకుంటామని వైద్యాధికారి వెల్లడించారు.

Read Also: ఢిల్లీలో హై టెన్షన్.. ప్రధాని మోదీ పై రేణుకా చౌదరి ఫైర్..!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>