మంత్రి సీతక్కకు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి లేఖ.. SRSPపై కీలక డిమాండ్

కలం, నిజామాబాద్ బ్యూరో: శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఎస్సారెస్పీ (SRSP) లో ప్రస్తుతం 15 టీఎంసీల నీరు నిల్వ ఉందని, దీని నుంచి 4 టీఎంసీల నీటిని జిల్లా రైతాంగ అవసరాల కోసం వినియోగించుకోవచ్చని బాల్కొండ ఎమ్మెల్యే (Balkonda MLA) వేముల ప్రశాంత్ రెడ్డి (Prashanth Reddy) సూచించారు. ఈ మేరకు ఆయన జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క, ప్రత్యేక అధికారిణి యోగితారాణాలకు లేఖ రాశారు.

వరద కాలువ, కాకతీయ, లక్ష్మీ కాలువల ద్వారా 0.50 టీఎంసీల చొప్పున నీటిని వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు. మెంట్రాజ్ పల్లి పంప్ హౌస్ 0.50 టీఎంసీలు, గుత్ప లిప్ట్ కు 2 టీఎంసీల నీటిని విడుదల చేసి చెరువులు నింపినా ఎస్సారెస్పీలో మరో 11 టీఎంసీల నీరు నిల్వ ఉంటుందని వివరించారు. రైతాంగానికి కరెంటు సరఫరా సక్రమంగా లేదని తెలిపారు.

11 గంటల నుంచి 14 గంటల వరకు మాత్రమే కరెంటు సరఫరా అవుతోందని, కనీసం నిరంతరాయంగా 18 గంటల పాటు కరెంటు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం భేషజాలకు పోకుండా గోదావరి నీటిని కన్నెపల్లి పంపుహౌజ్ మోటార్లతో వరదకాలువలోకి ఎత్తిపోయాలని కోరారు. రివర్స్ పంపింగ్ ద్వారా ఎస్సారెస్పీని నింపి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ రైతులకు సాగునీటి కొరత లేకుండా చూడాలని అధికారులను కోరారు.

Read Also: అన్ని రంగాలపై ఎల్ నినో తీవ్ర ప్రభావం: భట్టి విక్రమార్క

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>