రష్యా దాడిలో నలుగురు భారతీయుల మృతి

కలం, వెబ్ డెస్క్: ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో భాగంగా తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఉక్రెయిన్‌లోని ఒడెసా పోర్టులోని ‘ఎంవీ గోల్డెన్ లియో’ అనే నౌకపై రష్యా (Russia) వైమానిక దాడి చేసింది. ఈ ఘటనలో పది మంది మరణించగా.. అందులో నలుగురు భారతీయులు ఉన్నారు. మరో భారతీయుడు తీవ్రంగా గాయపడ్డారు. దాడి జరిగిన సమయంలో నౌకలో మొత్తం 17 మంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం.

ఖండించిన విదేశాంగ శాఖ..

పోర్ట్ నుంచి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న నౌకపై దాడి జరిగిందని భారత విదేశీ మంత్రిత్వ శాఖ పేర్కొంది. నలుగురు భారతీయులు ప్రాణాలు కోల్పోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం పరిస్థితి సమీక్షిస్తోందని.. బాధిత కుటుంబాలకు అవసరమైన సాయం చేపడుతోందని వివరించింది. ఈ దాడిని భారత్ తీవ్రంగా ఖండిస్తోందని.. వాణిజ్య నౌకలపై దాడులు, అమాయక నౌకా సిబ్బంది ప్రాణాలను ప్రమాదంలో పడేయడం సరికాదని ఒక ప్రకటనలో తెలిపింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>