హమాలీల సమస్యలు పరిష్కరించండి.. కలెక్టరేట్ ఎదుట ఏఐటీయూసీ ధర్నా

కలం, నిర్మల్ : సివిల్ సప్లై హమాలీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ (AITUC) ఆధ్వర్యంలో సోమవారం నిర్మల్ జిల్లా కలెక్టరేట్ ఎదుట హమాలీలు ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టరేట్ లో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు భూక్యా రమేష్ మాట్లాడారు.

గతంలో మూడు నెలలకు ఒకసారి నిర్వహించే రేషన్ పంపిణీని ఇప్పుడు ప్రతి నెలా నిర్వహించాలని అధికారులు ఒత్తిడి చేయడంతో హమాలీ కార్మికులపై పనిభారం పెరిగి ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని అన్నారు. అధిక ఒత్తిడి కారణంగా గుండె సంబంధిత వ్యాధులు పెరుగుతున్నాయని అన్నారు. అలాగే ప్రతి నెల 10వ తేదీన చెల్లించాల్సిన బిల్లులు రెండు నెలలుగా పెండింగ్‌లో ఉండటంతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. హమాలీల బిల్లులను సకాలంలో చెల్లించి, వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>