కలం, నారాయణపేట: గత ప్రభుత్వం కోట్లు వెచ్చించి మెడికల్ కాలేజీ నిర్మిస్తే కేవలం 50 సీట్లతో కాలేజీని నడిపించడం బాధాకరమని నారాయణపేట (Narayanpet) మాజీ ఎమ్మెల్యే ఎస్. రాజేందర్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నారాయణపేట మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీట్లను 50 నుంచి 150కు పెంచాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని ఇతర ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో 150 ఎంబీబీఎస్ సీట్లు ఉండగా, నారాయణపేట మెడికల్ కళాశాలలో మాత్రం 50 సీట్లకే పరిమితం చేయడం వల్ల పేద, మధ్యతరగతి విద్యార్థులు వైద్య విద్యకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
నారాయణపేట జిల్లా వెనుకబడిన ప్రాంతం కావడంతో ఇక్కడి విద్యార్థులకు మెరుగైన విద్యా అవకాశాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి నారాయణపేట మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీట్లను 50 నుంచి 150కు పెంచాలని డిమాండ్ చేశారు.
Read Also: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి సూసైడ్ నోట్లో సంచలన విషయాలు
Follow Us On : WhatsApp

