రైతు కూలీలతో మమేకమైన డిప్యూటీ సీఎం

కలం, ఖమ్మం బ్యూరో : ఖమ్మం (Khammam) జిల్లా వైరా మండలంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) ఆకస్మికంగా కాన్వాయ్‌ను ఆపి రైతు కూలీలను కలుసుకున్నారు. గండగలపాడు నుంచి స్నానాల లక్ష్మీపురం వైపు వెళ్తున్న ఆయన కాన్వాయ్ రోడ్డు పక్కన ఉన్న పొలాల వద్ద ఆగింది. అనంతరం భట్టి విక్రమార్క స్వయంగా కారు దిగి పొలాల్లో పనిచేస్తున్న రైతు కూలీల వద్దకు వెళ్లి వారితో ఆత్మీయంగా మాట్లాడారు. హోదా, భద్రతా ఏర్పాట్లను పక్కన పెట్టి నేరుగా తమ వద్దకు వచ్చిన డిప్యూటీ సీఎంను చూసి కూలీలు ఆనందం వ్యక్తం చేశారు.

పొలం గట్టుపై కూలీలతో మాట్లాడిన భట్టి విక్రమార్క (Bhatti Vikramarka).. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా అని ఆరా తీశారు. ఉచిత విద్యుత్, రేషన్ ద్వారా సన్న బియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల వంటి పథకాల అమలు గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు ఈ పర్యటనలో భాగంగా రైతు కూలీలతో మమేకమైన భట్టి విక్రమార్క తీరుపై పలువురు ప్రశంసలు వ్యక్తం చేశారు.

Read Also: తిట్లు, ఓట్లు రేవంత్‌రెడ్డికి తెలిసింది ఇదే.. కేటీఆర్ ఫైర్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>