విద్యార్థులపై లాఠీచార్జ్ అప్రజాస్వామికం: మంత్రి పొన్నం ఫైర్

కలం, కరీంనగర్ బ్యూరో : ఢిల్లీలో నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై న్యాయం కోరుతూ శాంతియుతంగా పార్లమెంట్ వైపు మార్చ్ నిర్వహించన విద్యార్థులు, యువజన సంఘాలపై పోలీసులు లాఠీచార్జీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు. ఈ చర్య అత్యంత దురదృష్టకరమని, ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఫైర్ అయ్యారు.

ఈ సందర్భంగా నీట్ పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న అవకతవకలు, పేపర్ లీకేజీ ఘటనలతో లక్షలాది మంది విద్యార్థులు, వారి కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురయ్యారని అన్నారు. దీంతో విద్యార్థులు తమ భవిష్యత్తుకు సంబంధించిన న్యాయమైన డిమాండ్లతో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే, వారి గొంతును అణిచివేయడానికి బలప్రయోగం చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు.

ఈ వ్యవహారానికి రాజకీయ బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) డిమాండ్ చేశారు. దేశ యువత భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిన ఈ పరిస్థితిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మౌనం ఎందుకు వహిస్తున్నారని ప్రశ్నించారు. దేశ యువతకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రధానమంత్రిపై ఉందన్నారు. విద్యార్థులపై నమోదైన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని, లాఠీచార్జీకి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని.. అలాగే నీట్ పరీక్షల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని నిర్ధారించేలా కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు.

Read Also: హైడ్రా కమిషనర్ పై హైకోర్టు సీరియస్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>