కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌లో డాక్యుమెంట్ రైటర్ల సమ్మె (పెన్‌డౌన్) అంశంపై సీఎం చంద్రబాబు (Chandrababu) నేడు ఉన్నతాధికారులతో కీలక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్యుమెంట్ రైటర్ల ఉపాధికి సంబంధించి సీఎం సంచలన నిర్ణయం తీసుకున్నారు. వారి జీవనోపాధికి ఎలాంటి ఢోకా ఉండదని , ప్రభుత్వం పూర్తి భరోసా ఇస్తుందని చెప్పారు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులను ప్రైవేటీకరణ చేసే ప్రసక్తే లేదని సీఎం చంద్రబాబు ప్రకటించారు.
ఈ మేరకు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులను (Sub Registrar Office) ప్రైవేటీకరించనున్నారని వస్తున్న వార్తలను సీఎం ఖండించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రేషన్ కేంద్రాలు కేవలం ప్రజల సేవ కోసమే పనిచేస్తాయని, టెక్నాలజీని వాడుకుంటూ ప్రజలకు ఇబ్బందులు లేకుండా సేవలు అందించడమే ప్రభుత్వ ప్రాధాన్యత అని చెప్పుకొచ్చారు. అంతేకానీ ఎవరి ఉపాధినీ దెబ్బతీసే ఉద్దేశం లేదని క్లారిటీ ఇచ్చారు.
డాక్యుమెంట్ రైటర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారి సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తామని సీఎం చంద్రబాబు (Chandrababu) హామీ ఇచ్చారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన స్పష్టమైన హామీతో డాక్యుమెంట్ రైట్లర్ల పెన్‌డౌన్ వివాదానికి తెరపడినట్లయింది. సీఎం చంద్రబాబు ప్రకటనపై డాక్యుమెంట్ రైటర్ల సంఘాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.
Read Also: జనసేనానికి వినూత్న కానుక.. అటవీ సంపదతో ఎంపీ పరామర్శ!
Follow Us On : WhatsApp

