కలం, నిర్మల్: కేజీబీవీ (KGBV), యూఆర్‌ఎస్(URS), సర్వ శిక్ష అభియాన్ (SSA) ఉద్యోగులకు మినిమం టైమ్ స్కేల్ వర్తింపజేసి, వారి సేవలను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (TSUTF) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిర్మల్ (Nirmal) జిల్లా లక్ష్మణచందా మండల కేంద్రంలో సోమవారం పోస్టుకార్డు ఉద్యమాన్ని (Postcard Protest) ప్రారంభించారు.
ఈ సందర్భంగా టీఎస్ యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంట అశోక్ మాట్లాడుతూ.. కేజీబీవీ, యూఆర్‌ఎస్, సర్వ శిక్ష ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు రాష్ట్రవ్యాప్తంగా పోస్టుకార్డు ఉద్యమాన్ని (Postcard Protest) చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ నాయకులు వినోద్ కుమార్, బాపురెడ్డి, నారాయణ వర్మ, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ నవితతో పాటు కేజీబీవీ సిబ్బంది, సర్వ శిక్ష ఉద్యోగులు పాల్గొన్నారు.
Read Also: తిట్లు, ఓట్లు రేవంత్‌రెడ్డికి తెలిసింది ఇదే.. కేటీఆర్ ఫైర్
Follow Us On: Sharechat

