కలం, వెబ్ డెస్క్ : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి తెరకెక్కించిన హర్రర్ థ్రిల్లర్ ది రాజాసాబ్ (Raja Saab). ప్రభాస్ ఫస్ట్ టైమ్ హర్రర్ జోనర్ లో సినిమా చేయడం.. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ కు ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో రాజాసాబ్ మూవీ పై మరింత క్రేజ్ ఏర్పడింది. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. జనవరి 9న సంక్రాంతి కానుకగా భారీ స్థాయిలో థియేటర్స్ లోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. అయితే.. రాజాసాబ్ ఎలా ఉండబోతుందో ఆల్రెడీ లీకైంది. ఇంతకీ.. రాజాసాబ్ ఎలా ఉండబోతుంది..?
రాజాసాబ్ రన్ టైమ్ 3 గంటల 6 నిమిషాలు అని సమాచారం. క్రెడిట్స్ ఎండ్ టైటిల్స్ పోగా 3 గంటలు రన్ టైమ్ అని.. ఫస్టాఫ్ కంటే.. సెకండాఫ్ రన్ టైమ్ ఎక్కువ అని తెలిసింది. సెకండాఫ్ 1 గంట 43 నిమిషాలు ఉంటుందట. ఎలివేషన్స్, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అంతా కూడా సెకండాఫ్ లోనే పెట్టారట. దీంతో సెకండాఫ్ రాజాసాబ్ కు కీలకం. ఇది కానీ క్లిక్ అయితే.. సంక్రాంతికి రాజాసాబ్ విన్నర్ గా నిలిచే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతుంది. అందుకనే.. మేకర్స్ రాజాసాబ్ సక్సెస్ పై పూర్తి నమ్మకంతో ఉన్నారు.
ఇదిలా ఉంటే.. విడుదలకు గట్టిగా రెండు వారాలే టైమ్ ఉంన్నా.. ఇంత వరకు చెప్పుకోదగ్గ ప్రమోషన్స్ జరగడం లేదు. మారుతి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నారు. ప్రభాస్ ప్రమోషన్స్ కు దూరం. నిర్మాత టీ.జీ విశ్వప్రసాద్ రిలీజ్ హాడావిడిలో ఉన్నారు. మొత్తానికి రాజాసాబ్ (Raja Saab) ప్రమోషన్స్ అనేది అస్తవ్యస్తంగా మారింది. అయితే.. త్వరలో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయాలి అనుకుంటున్నారు. అది ఎప్పుడు చేస్తారో.. ఎక్కడ చేస్తారో క్లారిటీ లేదు. ఈ విషయంపై త్వరలోనే మేకర్స్ ప్రకటిస్తారని సమాచారం.
Read Also: పవన్, మహేష్.. గెలిచేది ఎవరు..?
Follow Us On: Youtube


