కరీంనగర్‌లో ఘనంగా పోచమ్మతల్లి బోనాల జాతర

కలం, కరీంనగర్: జిల్లా కేంద్రంలోని భగత్ నగర్ వెంకటేశ్వర కాలనీలో ఆషాడమాసం సందర్భంగా పోచమ్మ తల్లి బోనాల జాతర (Karimnagar Bonalu) అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో జరిగింది. శ్రీ వెంకటేశ్వర కాలనీ డెవలప్మెంట్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఈ వేడుకలకు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ నగరపాలక సంస్థ మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు (Yadagiri Sunil Rao) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా యాదగిరి సునీల్ రావు.. స్వయంగా నెత్తిన బోనమెత్తి, బోనాల ఊరేగింపును ప్రారంభించారు.

అనంతరం పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళలతో కలిసి బోనాలతో ఊరేగింపుగా వెళ్లి, పోచమ్మ తల్లి దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర కాలనీ డెవలప్‌మెంట్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు గాజె నాగులు, ముఖ్య నాయకులు చెప్యాల రాంరెడ్డి, తడిసిన బాల్ రెడ్డి, ముస్కుల విద్యాసాగర్ రెడ్డి, తిప్పారపు శ్రీనివాస్‌లతో‌‌పాటు వెంకటేశ్వర కాలనీ వాసులు, మహిళలు విశేష సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

Read Also: పగలు తాపీ మేస్త్రీలు.. రాత్రయితే దొంగలు!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>