చెన్నూరులో అధికారులపై కారంపొడి, పెట్రోల్‌తో దాడి.. కారణం ఇదే!

కలం, వెబ్ డెస్క్ : మంచిర్యాల జిల్లా చెన్నూరు (Chennur)లో శనివారం తీవ్ర కలకలం రేగింది. ఆక్రమణకు గురైన దేవాదాయ శాఖకు చెందిన భూమిని స్వాధీనం చేసుకునేందుకు వెళ్లిన అధికారులపై కబ్జాకోరులు అమానుషంగా దాడికి తెగబడ్డారు. విధుల్లో ఉన్న అధికారులను అడ్డుకోవడమే కాకుండా.. వారిపై ముందస్తు ప్రణాళికతో తెచ్చుకున్న కారంపొడిని చల్లారు. అంతేకాదు కొందరు దుండగులు అధికారులపై పెట్రోల్ పోసి నిప్పంటించేందుకు యత్నించారు.

కబ్జాకోరుల ఊహించని ఈ ఘోర దాడితో అధికారులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. దీంతో వెంటనే ప్రాణాలను దక్కించుకోవడానికి అక్కడి నుంచి పరుగులు తీశారు. ప్రభుత్వ అధికారులపైనే ఇంతటి దారుణానికి ఒడిగట్టడం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై ప్రభుత్వం ఎలాంటి చర్యలకు దిగుతుందనేది ఆసక్తికరంగా మారింది.

Read Also: ఫాస్ట్ ఫుడ్ కాదు వరస్ట్ ఫుడ్.. ఇక్కడ తింటున్నారా!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>