బీఆర్ఎస్ స‌భ‌కు హైకోర్ట్ కోర్ట్ గ్రీన్ సిగ్న‌ల్‌!

క‌లం, వెబ్ డెస్క్‌: బీఆర్ఎస్ (BRS) పార్టీ ఆధ్వ‌ర్యంలో శ‌నివారం స‌రూర్‌న‌గ‌ర్‌లో నిర్వ‌హించ‌నున్న యువ సంగ్రామ స‌ద‌స్సు (Yuva Sangrama Sadassu)కు తెలంగాణ హైకోర్ట్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ముందుగా ఈ స‌భ కోసం బీఆర్ఎస్ పార్టీ అన్ని ఏర్పాట్లు చేసుకున్న‌ప్ప‌టికీ పోలీసులు అనుమ‌తికి నిరాక‌రించారు. దీనిపై బీఆర్ఎస్ పార్టీ హైకోర్ట్‌ను ఆశ్ర‌యించింది. దీంతో కోర్ట్‌ ప‌లు ష‌ర‌తుల‌తో అనుమ‌తులు మంజూరు చేసింది. హైవేల‌ను బ్లాక్ చేయ‌వ‌ద్ద‌ని, ప్ర‌జ‌ల‌ రాక‌పోక‌ల‌కు ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌నివ్వొద్ద‌ని సూచించింది. ఈ స‌భ‌కు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజ‌రు కానున్నారు.

యూత్ డిక్లరేషన్ పేరిట నిరుద్యోగుల‌ను కాంగ్రెస్ మోసం చేసింద‌ని బీఆర్ఎస్ నేత‌లు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. యువ‌త భారీ ఎత్తున త‌ర‌లివ‌చ్చి ఈ స‌భ‌ను విజ‌య‌వంతం చేయాల‌ని పిలుపునిచ్చారు. మ‌రోవైపు ఈ స‌భ‌కు భారీ ఎత్తున యువ‌త‌ను తీసుకొచ్చేందుకు బీఆర్ఎస్ నేత‌లు స‌న్నాహ‌క స‌మావేశాలు కూడా నిర్వ‌హిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు, నిరుద్యోగ యువ‌త ఏక‌మై త‌మ గొంతు వినిపించేందుకు ఈ స‌భ వేదిక కానుంద‌ని పేర్కొంటున్నారు.

Read Also: కాలేజీలకు ఇంటర్ బోర్డు సీరియస్ వార్నింగ్.. కీలక ఆదేశాలు జారీ!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>