కలం, వనపర్తి: ప్రజా భద్రతే లక్ష్యంగా పోలీసు, ఎక్సైజ్ శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఎస్పీ సునీతారెడ్డి (SP Sunitha Reddy) సూచించారు. ఇటీవల వనపర్తి (Wanaparthy) జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన లింగాచారి (Lingachary) శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కను అందజేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మాదకద్రవ్యాలు, అక్రమ మద్యం తయారీ, రవాణా వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాల నిర్మూలనకు రెండు శాఖలు సమిష్టిగా పనిచేస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చన్నారు. ప్రజల ఆరోగ్యం, శాంతిభద్రతల పరిరక్షణ ప్రతి ప్రభుత్వ శాఖ బాధ్యతేనని పేర్కొన్నారు. చట్టాలపై ప్రజల్లో అవగాహన పెంచుతూ సురక్షిత సమాజ నిర్మాణానికి పోలీసు, ఎక్సైజ్ శాఖలు కలిసి పనిచేయాలని సూచించారు. నూతన బాధ్యతలు చేపట్టిన ఎక్సైజ్ సూపరింటెండెంట్ లింగాచారికి శుభాకాంక్షలు తెలిపారు.
Read Also: రేపే RAW NTR ఈవెంట్.. పోలీసులు షాక్
Follow Us On : WhatsApp

