కలం, వెబ్ డెస్క్: పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు ఎంతటి కష్టానైన్నా భరిస్తారు. ఎన్ని అడ్డంకులనైనా అధిగమిస్తారు. చివరకు ప్రాణాలకైనా తెగిస్తారు. తన కుమారుడి చదువు కోసం ఓ తండ్రి చేసిన సాహసం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నేపాల్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బిహార్‌లోని (Bihar) నదులన్నీ ఉగ్రరూపం దాల్చాయి. ఈ క్రమంలో బగాహా ప్రాంతంలో ఓ తండ్రి తన కొడుకు చదువు కోసం ప్రాణాలకు తెగించి చేసిన సాహసం స్థానికంగా చర్చనీయాంశమైంది.
ఉవ్వెత్తున ఎగసిపడుతున్న మసాన్ నది ఉధృతిని లెక్కచేయకుండా తన కుమారుడిని భుజాలపై మోశాడు. నది ఉధృతిని తట్టుకొని ప్రమాదకరమైన నదిని దాటాడు. ప్రాణాలకు ప్రమాదం ఉన్నప్పటికీ, ఆ తండ్రి సాహసం అందర్నీ కదిలిస్తోంది. ఈ ఘటన రవాణా సౌకర్యాలు ఎంత దారుణంగా ఉన్నాయో ఎత్తిచూపుతోంది. అదే సమయంలో పేదరికంలోనూ చదువు పట్ల ఆ కుటుంబానికి ఉన్న సంకల్పానికి ఉదాహరణగా నిలుస్తోంది.
కొడుకు చదువు కోసం ప్రాణాలను పణంగా పెట్టిన తండ్రి
-నేపాల్‌లో భారీ వర్షాల నేపథ్యంలో బీహార్లో ఉప్పొంగుతున్న నదులు
-తన కొడుకును బడికి తీసుకెళ్లేందుకు తండ్రి సాహసం
-భుజాలపై కొడుకును మోస్తూ.. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న మసాన్ నదిని దాటించిన తండ్రి
-దీనికి సంబంధించిన వీడియో సోషల్… pic.twitter.com/DjrKVWxuxw— Kalam Daily (@kalamtelugu) July 17, 2026
Read Also: ఇది కొత్త డేటింగ్ గురూ.. సూపర్ మార్కెట్స్‌కి క్యూ కడుతున్న సింగిల్స్!
Follow Us On : WhatsApp

