కొడుకు చదువు కోసం ఓ తండ్రి సాహసం.. ప్రాణాలకు తెగించి..!

కలం, వెబ్ డెస్క్: పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు ఎంతటి కష్టానైన్నా భరిస్తారు. ఎన్ని అడ్డంకులనైనా అధిగమిస్తారు. చివరకు ప్రాణాలకైనా తెగిస్తారు. తన కుమారుడి చదువు కోసం ఓ తండ్రి చేసిన సాహసం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నేపాల్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బిహార్‌లోని (Bihar) నదులన్నీ ఉగ్రరూపం దాల్చాయి. ఈ క్రమంలో బగాహా ప్రాంతంలో ఓ తండ్రి తన కొడుకు చదువు కోసం ప్రాణాలకు తెగించి చేసిన సాహసం స్థానికంగా చర్చనీయాంశమైంది.

ఉవ్వెత్తున ఎగసిపడుతున్న మసాన్ నది ఉధృతిని లెక్కచేయకుండా తన కుమారుడిని భుజాలపై మోశాడు. నది ఉధృతిని తట్టుకొని ప్రమాదకరమైన నదిని దాటాడు. ప్రాణాలకు ప్రమాదం ఉన్నప్పటికీ, ఆ తండ్రి సాహసం అందర్నీ కదిలిస్తోంది. ఈ ఘటన రవాణా సౌకర్యాలు ఎంత దారుణంగా ఉన్నాయో ఎత్తిచూపుతోంది. అదే సమయంలో పేదరికంలోనూ చదువు పట్ల ఆ కుటుంబానికి ఉన్న సంకల్పానికి ఉదాహరణగా నిలుస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>