విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఇదే చివరి అవకాశం!

కలం, వెబ్ డెస్క్: ఇంటర్ పూర్తయి డిగ్రీలో చేరాలనుకునే (Degree Admissions) విద్యార్థులకు తెలంగాణ ఉన్నత విద్యా మండలి మరోసారి అలర్ట్ ప్రకటించింది. ఈ నెల 20 నుంచి చివరి ఫేజ్, స్పెషల్ అడ్మిషన్ షెడ్యూల్ ప్రకటించింది. 20 నుంచి 26వ తేదీ వరకు దోస్త్ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 20 నుంచి 27వ తేదీ వరకు కాలేజీల కోసం వెబ్ ఆప్షన్లు పెట్టుకోవచ్చు. 30న కాలేజీల అలాట్‌మెంట్ ఆర్డర్ అందిస్తారు. ఆగస్ట్ ఒకటో తేదీ లోపు కాలేజీలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.

ఇలా చేయకపోతే సీటు గల్లంతే..

కాలేజీలో సీటు (Degree Admissions) పొందిన ప్రతి విద్యార్థి కచ్చితంగా కాలేజీకి వెళ్లి సీసీఓటీపీ సమర్పించాల్సి ఉంటుంది. అప్పుడే సదరు విద్యార్థికి కాలేజీలో అధికారికంగా సీటు అలాట్ అవుతుంది. లేకపోతే.. వెబ్ ఆప్షన్ పెట్టి, సీటు పొందినా.. లాభం ఉండదని ఉన్నత విద్యా మండలి హెచ్చరించింది. అదే సమయంలో, విద్యార్థి ఒక కాలేజీ మాత్రమే కాకుండా వెబ్ ఆప్షన్లు పెట్టే సమయంలో.. వీలైనన్ని ఎక్కువ కాలేజీలు పెట్టుకోవాలని సూచించింది.

ఆగస్ట్ నుంచి కాలేజీలు ప్రారంభం..

ఆగస్ట్ మొదటి వారం నుంచి డిగ్రీ కాలేజీలు ప్రారంభం కాబోతున్నట్లు విద్యా శాఖ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే మూడు రకాల అడ్మిషన్ల ప్రక్రియతో పాటు స్పెషల్ ఫేజ్ కూడా ప్రకటించారు. ఈ ప్రక్రియ ఆగస్ట్ ఒకటో తేదీలోగా పూర్తవుతుంది. ఈసారి డిగ్రీలో కొత్తగా ఏపీఈడీ కోర్సులు తీసుకొస్తున్నారు. డిగ్రీ పూర్తయ్యాక.. కొలువు వచ్చేలా చేయడమే వీటి ప్రధాన లక్ష్యం.

Read Also: రేపే RAW NTR ఈవెంట్.. పోలీసులు షాక్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>