కలం, వెబ్ డెస్క్: ఒడిశాలోని పూరీ జగన్నాథ రథ యాత్రలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ మహా రథయాత్రకు భారీగా భక్తులు తరలి రావడంతో తీవ్ర తొక్కిసలాట (Puri Rath Yatra Stampede) జరిగింది. ఈ తొక్కిసలాటలో ఒకరు మృతి చెందగా.. 100 మందికి పైగా గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుడు కటక్‌కు చెందిన అనిల్ దాస్‌గా గుర్తించారు. జగన్నాథ రథయాత్రకు సుమారు 10 లక్షల మంది భక్తులు వచ్చినట్లు తెలుస్తోంది. గర్భగుడి నుంచి దేవతామూర్తులను తీసుకువస్తున్న సమయంలో భక్తులు ముందుకు దూసుకురావడంతో ఉద్రిక్తత నెలకొంది. భక్తులు అదుపుతప్పి ఒకరిపై ఒకరు పడటంతో తొక్కిసలాట జరిగింది.
Read Also: బిగ్ అప్డేట్ : జమిలి ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ
Follow Us On: X(Twitter)

