పూరీ రథయాత్రలో తీవ్ర విషాదం

కలం, వెబ్ డెస్క్: ఒడిశాలోని పూరీ జగన్నాథ రథ యాత్రలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ మహా రథయాత్రకు భారీగా భక్తులు తరలి రావడంతో తీవ్ర తొక్కిసలాట (Jagannath Rath Yatra Stampede) జరిగింది. ఈ తొక్కిసలాటలో ఒకరు మృతి చెందగా.. 100 మందికి పైగా గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుడు కటక్‌కు చెందిన అనిల్ దాస్‌గా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>