కలం, జనగామ: జనగామ జిల్లా బచ్చన్నపేట (Bachannapet)లో ఇటీవల జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.15.50 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు, రూ.15 వేల నగదు, మూడు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు జనగామ ఇన్‌చార్జి ఏసీపీ బీమ్ శర్మ తెలిపారు.
ఈ నెల 8న ఇంటికి తాళం వేసి హైదరాబాద్‌కు వెళ్లిన బాధిత కుటుంబం తిరిగి వచ్చేసరికి చోరీ జరిగినట్లు గుర్తించి ఫిర్యాదు చేసింది. సీసీటీవీ దృశ్యాలు, సాంకేతిక ఆధారాల ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు గురువారం కొన్నె క్రాస్ రోడ్డు వద్ద అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు కంప విజయ్ అలియాస్ మొండితోపాటు ఇద్దరు మైనర్ నిందితులను అరెస్టు చేసినట్లు ఏసీపీ తెలిపారు. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు.
Read Also: తెలంగాణలో తీవ్రంగా కరెంట్ కోతలు: హరీశ్ రావు
Follow Us On: X(Twitter)

