కలం, నిర్మల్: నిర్మల్ జిల్లా సారంగాపూర్ (Sarangapur) మండల కేంద్రంలో గుర్తుతెలియని వ్యక్తులు సుమారు 50 తాటి, ఈత చెట్లను నరికివేసిన విషయం తెలిసిందే. ఈ నరికివేయబడిన ఈత చెట్ల ప్రాంతాన్ని ఎక్సైజ్ ఎస్సై అభిషేక్ గురువారం సందర్శించి పరిశీలించారు. ఘటనకు సంబంధించిన వివరాలను స్థానికుల నుంచి అడిగి తెలుసుకున్నారు. చెట్ల నరికివేతపై పూర్తి వివరాలు సేకరించారు.
ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. సంబంధిత నిబంధనల ప్రకారం అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈత చెట్లను అక్రమంగా నరికివేయడం వల్ల ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలగడమే కాకుండా, గీత కార్మికుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడుతుందని గౌడ సంఘం నాయకులు ఎస్ఐ దృష్టికి తీసుకెళ్లారు. బాధ్యులపై వెంటనే కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
Read Also: బిగ్ అప్డేట్ : జమిలి ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ
Follow Us On : WhatsApp

