కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి (Sangareddy) జిల్లాలోని కోహీర్ మండలం దిగ్వాల్ విద్యుత్ సబ్ స్టేషన్ (Digwal Power Substation) పరిధిలో గల రాయిపల్లి, మద్రి గ్రామాల్లో గత వారం రోజులుగా తీవ్ర లో-వోల్టేజ్ సమస్య వేధిస్తోంది. దీంతో విసిగిపోయిన గ్రామస్థులు దిగ్వాల్ విద్యుత్ సబ్ స్టేషన్‌ను ముట్టడించారు.
గ్రామాల్లో లో-వోల్టేజ్ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేస్తూ సబ్ స్టేషన్ ఎదుట నిరసన చేపట్టారు. అక్కడే ఉన్న విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ (AE)ను గ్రామస్థులు ఘెరావ్ చేసి, లో ఓల్టేజ్ సమస్యపై నిలదీశారు.
Read Also: నిర్మల్ కాంగ్రెస్‌లో రాజుకున్న అంతర్గత పోరు!
Follow Us On: Instagram

