కలం, కరీంనగర్ బ్యూరో: జగిత్యాల జిల్లా కోరుట్ల (Korutla )లో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన పెట్రోల్ ట్యాంకర్, బైక్‌ను ఢీకొట్టిన ఘటనలో ఓ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాద తీవ్రతకు బాలుడు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే ..కోరుట్ల (Korutla)లో ఓ బైక్ , పెట్రోల్ ట్యాంకర్ పరస్పరం బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న12 ఏళ్ల బాలుడు మగ్గిడి జస్వంత్ తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనలో అతని అన్న జస్వంత్ కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రుడైన బాలుడి అన్నను అత్యవసర చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదం ఎలా జరిగిందనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Read Also: ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. అలర్ట్ అయిన వైద్యులు..!
Follow Us On: X(Twitter)

