కలం, వెబ్ డెస్క్: కాలువలో పడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక వృద్ధురాలిని బ్లూ కోల్ట్స్ సిబ్బంది సకాలంలో స్పందించి సురక్షితంగా రక్షించారు. నర్సంపేట (Narsampet) పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తుతెలియని ఓ వృద్ధురాలు ప్రమాదవశాత్తు కాలువలో పడింది. ఇది గమనించిన బ్లూ కోల్ట్ అధికారి రమేశ్ ఆమెను కాలువ నుంచి బయటకు తీసి, మానవత్వంతో తక్షణమే చికిత్స నిమిత్తం నర్సంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
అయితే ఆ వృద్ధురాలు ప్రస్తుతం మాట్లాడలేని స్థితిలో ఉండటంతో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. వృద్ధురాలి వివరాలు గుర్తించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. బాధ్యతాయుతంగా వ్యవహరించి వృద్ధురాలి ప్రాణాలు కాపాడిన బ్లూ కోల్ట్ అధికారి రమేష్‌ను స్థానికులు అభినందించారు.

