కలం, నిర్మల్ : సారంగాపూర్ (Sarangapur) మండల కేంద్రంలోని సుమారు 50 తాటి, ఈత చెట్లను నరికించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మండల గౌడ సంఘం నాయకులు ఎల్లా గౌడ్, నవీన్ గౌడ్, సాయిగౌడ్, విశ్వేశం గౌడ్, జీవన్ గౌడ్ డిమాండ్ చేశారు. కుమ్మరి నరసయ్య చెట్లను నరికించారని ఆరోపిస్తూ, గీత కార్మికుల ఉపాధికి భంగం కలిగించే ఇటువంటి చర్యలను ప్రభుత్వం ఉపేక్షించకూడదన్నారు.
ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ, గౌడుల జీవనోపాధి కోసం తాటి, ఈత, ఖర్జూర చెట్ల పెంపకాన్ని ప్రోత్సహిస్తుండగా, కొందరు చెట్లను నరికి వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులను వెంటనే అరెస్టు చేసి ఎక్సైజ్, పోలీసు, అటవీ శాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని, లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

