ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అప్‌డేట్..

కలం, వెబ్ డెస్క్ : ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం (AP Govt) కీలక అప్‌డేట్ ఇచ్చింది. రాష్ట్రంలో 6 జోన్లు, 2 మల్టీ జోన్లను నోటిఫై చేస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ ఆర్డర్-2025 అమలులో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది.

తాజా ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలోని 26 జిల్లాలను జిల్లా, జోనల్, మల్టీ జోనల్, రాష్ట్ర స్థాయి పోస్టులుగా పునర్వ్యవస్థీకరించారు. ఉద్యోగాల నిర్వహణలో ఏకరూపత తీసుకురావడం, స్థానికత ఆధారిత నియామకాలను మరింత పారదర్శకంగా అమలు చేయడం ఈ మార్పుల ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం వెల్లడించింది.

ఈ కొత్త జోనల్ వ్యవస్థ అమల్లోకి రావడంతో ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల కేటాయింపులు, బదిలీలు, పదోన్నతులు, స్థానిక అభ్యర్థుల అర్హత వంటి అంశాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. వివిధ శాఖలు ఈ కొత్త విధానానికి అనుగుణంగా ఉద్యోగుల సర్వీస్ రికార్డులు, పోస్టుల వర్గీకరణ, కేడర్ నిర్మాణాన్ని పునర్వ్యవస్థీకరించనున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>