రాష్ట్ర స్థాయి క్రీడలు.. సత్తా చాటిన కరీంనగర్ పోలీసులు

కలం, కరీంనగర్ బ్యూరో : 5వ తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడలు అండ్ స్పోర్ట్స్ మీట్‌లో కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు (Karimnagar Commissionerate Police) అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. మొత్తం 11 పతకాలు సాధించి జోన్-3లో అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. ఈ పోటీల్లో కరీంనగర్ కమిషనరేట్ తరఫున పాల్గొన్న క్రీడాకారులు 2 స్వర్ణ, 4 రజత, 5 కాంస్య పతకాలు సాధించి కమిషనరేట్‌కు గౌరవాన్ని తీసుకువచ్చారు.

ఈ విజయంతో కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ జోన్-3లో అత్యధిక పతకాలు సాధించిన యూనిట్‌గా నిలిచింది. ఈ సందర్భంగా కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం పతక విజేతలను అభినందించారు. విధి నిర్వహణతో పాటు క్రీడల్లోనూ రాణించడం ప్రతి పోలీసు సిబ్బందికి ఆదర్శమని పేర్ కొనియాడారు.

క్రమశిక్షణ, శారీరక దృఢత్వం, నిరంతర సాధనతో ఈ విజయాలు సాధ్యమయ్యాయని వెల్లడించారు. భవిష్యత్తులో మరిన్ని రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని కమిషనరేట్‌కు మరింత పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. క్రీడా స్పూర్తిని పెంపొందించేందుకు తెలంగాణ పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ప్రోత్సాహం అందిస్తోందని, పోలీసు సిబ్బంది ఆరోగ్యవంతంగా, ఫిట్‌గా ఉండేందుకు ఇటువంటి క్రీడా పోటీలు ఎంతో దోహదపడతాయని ఆయన తెలిపారు.

Read Also: విద్యా శాఖను అందుకే నా దగ్గ‌ర పెట్టుకున్నా: సీఎం రేవంత్ రెడ్డి

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>