కలం, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన పాదయాత్ర (KTR Padayatra)పై సంచలన ప్రకటన చేశారు. 2027లో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. ఆదిలాబాద్‌లోని సీసీఐ ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని కోరుతూ కేటీఆర్ బృందం నేడు ఢిల్లీలో కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామికి వినతిపత్రం సమర్పించింది. కేంద్ర మంత్రితో భేటీ అనంతరం కేటీఆర్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ రాజకీయాలపై, రాబోయే ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
గతంలోనే కేటీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర (KTR Padayatra) చేస్తానని ప్రకటించారు. అయితే అందరూ ఏడాదిలోనే ఈ కార్యక్రమం ఉంటుందని భావించారు. కానీ, కేటీఆర్ తన పాదయాత్ర 2027లో ఉంటుందని చెప్పేశారు. ఎక్కడ మొదలు పెట్టాలి, ఎక్కడ ముగించాలి అనేది పార్టీ ముఖ్య నాయకులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని, క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకొస్తామని, రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు.
Read Also: వాళ్లది వ్యూహమా.. మౌనమా..?
Follow Us On: X(Twitter)

