కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ సెంట్రల్ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అసోసియేషన్ నాయకులు.. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు (Yadagiri Sunil Rao) ని మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. తమ సంఘ భవన నిర్మాణం కోసం తగిన స్థలం కేటాయించాలని వారు ఈ సందర్భంగా కోరారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ కార్మికులందరూ ఒక సంఘంగా ఏర్పడి తమ అవసరాలను, సమస్యలను ఎన్నో ఇబ్బందుల నడుమ తీర్చుకుంటున్నామని తెలిపారు. ప్రస్తుతం తమ సంఘం ఆఫీస్ అద్దెలు, ఇతర ఖర్చులను సభ్యులమంతా సొంత డబ్బులతో భరిస్తున్నామని సునీల్ రావు (Sunil Rao) దృష్టికి తీసుకెళ్లారు. పెరుగుతున్న అద్దెలు, ఖర్చుల భారాన్ని తగ్గించుకునే ఆలోచనలో భాగంగా, సొంతంగా సంఘ భవనాన్ని నిర్మించుకోవాలని నిర్ణయించామని, స్పందించి భవన నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని కేటాయించి కార్మికులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ.. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay) ఆధ్వర్యంలో, కరీంనగర్లోని అన్ని కార్మిక సంఘాల సౌకర్యార్థం నూతనంగా ‘కార్మిక భవన్ (Karmika Bhavan)’ ను నిర్మించనున్నట్లు తెలిపారు. కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ మార్గదర్శకత్వంలో ముందుకు వెళ్తున్నామని, కార్మికులకు ఎలాంటి సమస్య వచ్చినా అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు.
కరీంనగర్లోని కార్మిక సంఘాలన్నింటికీ ఉపయోగపడేలా ఒక ప్రత్యేక భవనాన్ని నిర్మించడానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తామని అన్నారు. ఈ భవన నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని ఇప్పించే బాధ్యతను తీసుకుంటామని అన్నారు. అలాగే భవన నిర్మాణాన్ని పూర్తి స్థాయిలో బాధ్యత వహించి పూర్తి చేస్తామని తెలిపారు. కార్మికుల ఆరోగ్య, భవిష్య నిధికి సంబంధించిన EPF, ESI సమస్యల పరిష్కారానికి, వారికి ఆ సౌకర్యాలు అందేలా చూసే బాధ్యత మాదేనని, కార్మికులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ.. కార్మికులకు ఏ కష్టం వచ్చినా, ఏ సమస్య ఎదురైనా నేరుగా మమ్మల్ని సంప్రదించవచ్చునని తెలియజేశారు.
వారికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ అవసరమైన సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాం. కార్మికులు ఎవరూ, ఎక్కడా ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వారి పక్షాన నిలబడి పోరాడుతాం. కార్మికుల హక్కుల సాధనలో, వారి సంక్షేమం కోసం అవసరమైన అన్ని కార్యక్రమాలు చేపట్టడానికి తమ నాయకత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని యాదగిరి సునీల్ రావు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ దువ్వాసి రాజబాబు, వైస్ ప్రెసిడెంట్ కయ్యం పాపయ్య, జనరల్ సెక్రెటరీ బషీర్ మహమ్మద్, జాయింట్ సెక్రెటరీ పింగిలి మహేష్, ట్రెజరర్ కయ్యం నాగరాజు, ఎగ్జిక్యూటివ్ సభ్యులు పెండ్యాల అనిల్ రెడ్డి, నాయిని గంగారెడ్డి, వొల్లాల రవి, ఇతర బాడీ మెంబర్స్, తదితరులు పాల్గొన్నారు.
Read Also: ప్రభాస్ పేరు చెప్పగానే నాకు అదే గుర్తొస్తుంది: పూజా హెగ్డే
Follow Us On: Sharechat

