కలం, నిర్మల్ : హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఇటీవల జేఆర్ ఇంటర్నేషనల్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అటెంప్ట్‌లో పాల్గొని సర్టిఫికెట్లు, మెడల్స్ అందుకున్న నిర్మల్ జిల్లాకు చెందిన 16 మంది విద్యార్థులను బీజేపీ శాసనసభాపక్ష నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Maheshwar Reddy) బుధవారం అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, కోచ్‌లను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందిస్తూ, భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించి నిర్మల్ జిల్లాకు మరింత కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. క్రమశిక్షణ, పట్టుదలతో కృషి చేస్తే ప్రపంచ స్థాయిలోనూ విజయాలు సాధించవచ్చని ఆయన పేర్కొన్నారు.

