ఆహార కల్తీపై ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టాలి: దామోదర్

కలం, కరీంనగర్: ఆహార కల్తీ (Food Adulteration)పై ప్రభుత్వం కఠినమైన చర్యలు చేపట్టాలని దక్షిణాది రాష్ట్రాల వినియోగదారుల సమన్వయ సమితి(సీసీసీ) అధ్యక్షుడు డాక్టర్ పల్లెపాడు దామోదర్ అన్నారు. మంగళవారం కరీంనగర్ (Karimnagar) సీతారాంపూర్ లో గల ప్రముఖ సూపర్ మార్కెట్ లో ఆహార కల్తీ నిరోధక శాఖ అధికారులు, వివిధ వినియోగదారుల సంఘాలు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అందులో ఉన్న నాణ్యతలేని కారంపొడి, అల్లం పేస్టు, వంట నూనెలు, పన్నీర్, పాల ఉత్పత్తులను పరిశీలించారు. వాటిని పరీక్ష నిమిత్తం హైదరాబాదు ల్యాబ్ కు పంపించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ… నాణ్యతలేని ఆహార ఉత్పత్తులపై కఠిన చర్యలు చేపట్టాలని, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మూడు జోన్లకు ఒక్కొక్క మైక్రోలాబోరేటరీ అవసరమని ఆయన అన్నారు. వినియోగదారుల మండలి జాతీయ ప్రధాన కార్యదర్శి సాంబరాజు చక్రపాణి మాట్లాడుతూ.. ఆహార కల్తీ సమస్యను పటిష్టవంతంగా ఎదుర్కోవడానికి తెలంగాణ రాష్ట్రంలో మూడు జోన్లుగా విభజిస్తూ, ఆయా జోన్లకు జోనల్ కన్వీనర్ల నియామకం, చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

రాష్ట్రంలో రిజిస్టర్డ్ వినియోగదారుల సంఘాల ప్రతినిధులను జిల్లా ఆహార సలహా సంఘ సభ్యులుగా నియమించాలని అధికారులను కోరారు. అన్ని ప్రాంతాలకు మొబైల్ టెస్టింగ్ లాబోరేటరీలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు. ఈ తనిఖీలలో గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ రోహిత్ రెడ్డి, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అంకిత్ రెడ్డిలు మాట్లాడుతూ… సూపర్ మార్కెట్ నుంచి సేకరించిన వివిధ శాంపిల్స్ లను నాణ్యత పరీక్షల అనంతరం చర్యలు తీసుకోనున్నట్లు వినియోగదారుల ప్రతినిధులకు హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లాల వినియోగదారుల అధ్యక్షుడు అలుమల్ల ముకుంద రెడ్డి, వినియోగదారుల ప్రతినిధులు ఏ. సాంబశివరెడ్డి, పరాంకుశం కిరణ్ కుమార్, టి. శివదయాళ్ సింగ్. ఏ కృష్ణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>