CWG 2026: నీరజ్ భయం.. పాక్ అథ్లెట్ నదీమ్ సంచలన వ్యాఖ్యలు!

కలం, స్పోర్ట్స్: భారత జెవలినా త్రో సూపర్ స్టార్ నీరజ్ చోప్రా (Neeraj Chopra)తో జరగబోయే మహా సమరానికి ముందు పాకిస్థాన్ ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ అర్షద్ నదీమ్ (Arshad Nadeem) సంచలన వ్యాఖ్యలు చేశారు. జూలై 23 నుంచి గ్లాస్గోలో ప్రారంభం కానున్న కామన్వెల్త్ గేమ్స్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతుండటంతో తనపై తీవ్ర ఒత్తిడి ఉందని ఆయన సోమవారం ఒప్పుకున్నారు. ఈ మెగా ఈవెంట్‌లో పాకిస్థాన్ క్రీడా బృందానికి నదీమ్ నాయకత్వం వహించనున్నారు.

గత 2022 బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌కు నీరజ్ చోప్రా గాయం వల్ల దూరం కాగా, అర్షద్ నదీమ్ 90.18 మీటర్ల రికార్డు త్రోతో పసిడి పతకాన్ని గెలుచుకున్నారు. ఈసారి గట్టి పోటీ ఉన్నప్పటికీ టైటిల్‌ను నిలబెట్టుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు నదీమ్ ధీమా వ్యక్తం చేశారు. గతంలో నీరజ్ చోప్రాపై నదీమ్ సాధించిన ఏకైక పెద్ద విజయం 2024 పారిస్ ఒలింపిక్స్‌లోనే నమోదైంది. అక్కడ ఆయన 92.97 మీటర్ల త్రోతో సరికొత్త రికార్డు సృష్టిస్తూ బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు.

అయితే టోక్యోలో జరిగిన 2025 ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌ మాత్రం ఇద్దరికీ తీవ్ర నిరాశనే మిగిల్చింది. గాయాల కారణంగా నీరజ్ చోప్రా ఎనిమిదో స్థానంతో, నదీమ్ పదో స్థానంతో సరిపెట్టుకుని అభిమానులను తీవ్రంగా నిరాశపరిచారు. ప్రస్తుతం లాహోర్‌లో కఠిన శిక్షణ పూర్తి చేసుకున్న 29 ఏళ్ల నదీమ్, గ్లాస్గో వెళ్లే ముందు స్విట్జర్లాండ్‌లో జరిగే ఒక అంతర్జాతీయ పోటీలో పాల్గొననున్నారు. ఈ పోటీ ద్వారా తన శారీరక సామర్థ్యాన్ని, ఫిట్‌నెస్‌ను అంచనా వేసుకోవడానికి అవకాశం ఉంటుందని నదీమ్ భావిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>