కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) నూతన కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను కలెక్టర్ చిత్రా మిశ్రా సోమవారం రాత్రి పరిశీలించారు. మిగిలి ఉన్న పనులను శర వేగంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ ఆవరణలో నూతనంగా నిర్మించిన హెలిప్యాడ్‌ను పరిశీలించారు. హెలిప్యాడ్ పరిసరాల్లో గ్రీనరీ అభివృద్ధి చేసి, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
కలెక్టరేట్ భవనంలో నీటి సరఫరా, డ్రైనేజీ, విద్యుత్ లైటింగ్, సానిటేషన్ తదితర మౌలిక సదుపాయాల్లో ఎలాంటి లోపాలు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
పాత కలెక్టరేట్ భవనానికి మరమ్మతులు..
కలెక్టరేట్ గేట్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు. పాత కలెక్టరేట్ భవనానికి అవసరమైన మరమ్మతులను వెంటనే ప్రారంభించాలని సూచించారు. నూతన కలెక్టరేట్‌ను అన్ని సౌకర్యాలతో, ఆధునిక ప్రమాణాలకు అనుగుణంగా సిద్ధం చేయాలని దిశానిర్దేశం చేశారు. అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్ రెడ్డి, డీఆర్ఓ స్వామి, ఆర్ అండ్ బి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నరసింహాచారి, తహసీల్దార్లు సుధాకర్, రాజేష్, అధికారులు పాల్గొన్నారు.

