బాసర రైల్వే స్టేషన్‌లో పోలీసుల తనిఖీలు

కలం, నిర్మల్: బాసర (Basara) రైల్వే స్టేషన్‌లో రైల్వే పోలీసులు సోమవారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. రాత్రి సమయంలో చోటుచేసుకుంటున్న ఘటనల నేపథ్యంలో రైల్వే క్రైమ్ బ్రాంచ్ స్పెషల్ ఇన్‌స్పెక్టర్ సైదయ్య ఆధ్వర్యంలో డాగ్ స్క్వాడ్‌తో కలిసి ప్లాట్‌ఫారాలు, ట్రాక్‌లు, ప్రయాణికుల నిరీక్షణ గదులను పరిశీలించారు.

మహిళా ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా అనుమానాస్పద ఘటనలు లేదా ఇబ్బందులు ఎదురైతే వెంటనే సంప్రదించాలని ఇన్‌స్పెక్టర్ సూచించారు. తనిఖీల్లో ఏఎస్‌ఐ జుబేర్, డాగ్ స్క్వాడ్ నిపుణుడు నరేష్ సింగ్, కానిస్టేబుల్ మురళి పాల్గొన్నారు.

Read Also: భద్రాచలం వారధి.. గుండెలను పిండేసే కన్నీటి కథకు 62 ఏళ్ళు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>