వనపర్తి కలెక్టరేట్‌లో జర్నలిస్టుల నిరసన.. సమస్యలపై వినతి

కలం, వనపర్తి: జర్నలిస్టుల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) వనపర్తి జిల్లా కమిటీ డిమాండ్ (TWJEF Demands) చేసింది. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం వనపర్తి (Wanaparthy) కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఎన్. ఖీమ్యా నాయక్‌కు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు జూటూరు రాము మాట్లాడుతూ.. అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు అందించాలని, రద్దైన రైల్వే పాస్‌లను పునరుద్ధరించాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, అక్రిడిటేషన్ కమిటీల్లో అన్ని జర్నలిస్టు సంఘాలకు ప్రాతినిధ్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వినతిపత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తామని అదనపు కలెక్టర్ హామీ ఇచ్చారనీ తెలిపారు. కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ నాయకులు, పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>