కలం, వెబ్ డెస్క్: ఏపీకి అత్యంత కీలకమైన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను సోమవారం సీఎం చంద్రబాబు (CM Chandrababu) పరిశీలించారు. ఏలూరు జిల్లాలోని ప్రాజెక్టు వద్దకు వెళ్లి హెలికాప్టర్ ద్వారా రౌండ్స్ కొట్టి జలాశయ ప్రాంతాన్ని విహంగ వీక్షణం చేశారు. స్పిల్‌వే వద్ద గోదావరి వరద నీటి ప్రవాహంతో పాటు ఎగువ, దిగువ కాఫర్ డ్యాంల మధ్య కొనసాగుతున్న నిర్మాణ పనులను పరిశీలించారు. ప్రాజెక్టు డెవలప్ మెంట్ పై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
అలాగే ప్రాజెక్టు (Polavaram Project)లోని ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యాం గ్యాప్-1, గ్యాప్-2 పనులను సీఎం పరిశీలించారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నిర్మాణ పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. పనుల నాణ్యత, వేగంపై అధికారులను ఆరా తీశారు. ప్రాజెక్టు నిర్ణీత గడువులో పూర్తి అయ్యేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
సీఎం వెంట ఇరిగేషన్ మినిస్టర్ మంత్రి నిమ్మల రామానాయుడు (Nimmala Rama Naidu), ఉన్నతాధికారులు ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు ప్రస్తుత పనుల స్థితి, భవిష్యత్ కార్యాచరణపై అధికారులు సీఎంకు వివరాలు అందించారు. ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Read Also: పాలిటిక్స్‌లోకి ఎన్టీఆర్.. క్లారిటీ ఇచ్చిన టీం
Follow Us On: Sharechat

