తప్పనిసరిగా ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవాలి : కలెక్టర్ భవేశ్ మిశ్రా

కలం, నిర్మల్ : 1 నుంచి 19 సంవత్సరాల వయస్సు గల ప్రతి ఒక్కరికీ నులిపురుగుల నివారణ కోసం ఆల్బెండజోల్ మాత్రలు అందేలా చర్యలు తీసుకోవాలని నిర్మల్ (Nirmal) కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. అంతర్జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా సోమవారం జిల్లా కేంద్రంలోని సోఫీనగర్ లో గల ప్రభుత్వ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు కలెక్టర్ ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవడం వల్ల నులిపురుగులు నశించి, రక్తహీనత వంటి సమస్యలు తగ్గుతాయని తెలిపారు. ప్రతి సంవత్సరం తప్పనిసరిగా ఈ మాత్రలను తీసుకోవాలని సూచించారు. విద్యార్థులు ఆహారం తినే ముందు తప్పనిసరిగా చేతులను శుభ్రంగా కడుక్కోవాలని, వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను కూడా పాటించాలని సూచించారు.

ఆరోగ్యవంతమైన జీవనశైలి అలవర్చుకుని అనారోగ్యాలకు దూరంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి రాజేందర్, జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న, ఇమ్యూనైజేషన్ అధికారి నయనా రెడ్డి, ప్రిన్సిపాల్ డానియల్ తదితరులు పాల్గొన్నారు.

Read Also: నిర్మల్‌లో పోలీసుల కార్డెన్ సెర్చ్.. పత్రాలు లేని వాహనాలు సీజ్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>