కలం, వెబ్ డెస్క్: బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ (Aamir Khan) మూడో పెళ్లిపై మహారాష్ట్ర మంత్రి నితేష్ రాణె సంచలన వ్యాఖ్యలు చేశారు. లవ్ జిహాద్‌కు ఆయన బ్రాండ్ అంబాసిడర్ అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇలాంటి వ్యక్తులను నెత్తికెక్కించుకోవడం మానుకోవాలని ఫ్యాన్స్‌కు సూచించారు. అసలు ఇలాంటి హీరోను హిందూ సమాజం ఎందుకు అభిమానించాలని ప్రశ్నించారు.
ఆయన సినిమాలు చూసే యువత ఇప్పటికైనా ఆలోచించుకోవాలని స్పష్టం చేశారు. అమీర్ ఖాన్ పెళ్లి ఆయన వ్యక్తిగత ఇష్టమని.. తాను దాని గురించి మాట్లాడటం లేదన్నారు. నితేష్ రాణె వ్యాఖ్యలు మహారాష్ట్రలో తీవ్ర వివాదానికి దారి తీశాయి.
కిరణ్ రావుకి విడాకులు ఇచ్చి..
అమీర్ ఖాన్ ఈ నెల 5వ తేదీన గౌరి స్ప్రాట్ అనే వ్యాపారవేత్తను మూడో వివాహం చేసుకున్నారు. ముంబైలో అత్యంత సన్నిహితుల మధ్య జరిగిన ఈ వివాహానికి సంబంధించి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అమీర్ పెళ్లిపై నెటిజన్ల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
కిరణ్ రావుతో చాలా కాలంగా అమీర్ (Aamir Khan) దూరంగా ఉంటూ వస్తున్నారు. అనంతరం పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. అమీర్ ఖాన్‌కు 1986లోనే రీనా దత్తాతో మొదటి వివాహం జరిగింది. 2002లో విడాకులు తీసుకున్నాక.. కిరణ్ రావుని పెళ్లి చేసుకున్నారు. తాజాగా గౌరి స్ప్రాట్‌ను ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్నారు.
Read Also: హెల్త్ సప్లిమెంట్లు వాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త!
Follow Us On: Instagram

