కలం, మెదక్ బ్యూరో: షాబాద్‌లో రాజ్ కుమార్ అనే సైకో ఏకంగా ఆరుగురిని గొంతు కోసి దారుణంగా హత్య చేసిన ఉదంతం పూర్తిగా సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) వైఫల్యమేనని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్‌లో SIR అవగాహన కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు (Harish Rao) సంచలన ఆరోపణలు చేశారు.
పొక్సో కేసులో ఉన్న ఒక నిందితుడిని కాపాడటానికి, సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన మార్కెట్ కమిటీ ఛైర్మన్ రూ. 20 లక్షల లంచం ఇచ్చి ఆ రేపిస్ట్‌ను రక్షించారని ఆరోపించారు. అంతేకాకుండా, పోలీసులు సైతం ఆ రేపిస్ట్‌తో కలిసి మద్యం సేవించారని విమర్శించారు. సదరు నిందితుడిని పోలీసులు సకాలంలో అరెస్ట్ చేయకుండా 45 రోజుల పాటు ఆలస్యం చేయడం వల్లే, అతడు బెయిల్‌పై బయటకు వచ్చి ఈ ఆరుగురిని దారుణంగా హత్య చేయగలిగాడని హరీష్ రావు పేర్కొన్నారు.
పోలీస్ వ్యవస్థపై తీవ్ర విమర్శలు
ప్రస్తుతం రాష్ట్రంలో పోలీసులను కేవలం ల్యాండ్ సెటిల్‌మెంట్ల కోసమే వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి రాష్ట్రంలో ఆడపిల్లల తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనల మధ్య బతికే పరిస్థితి దాపురించిందన్నారు. షాబాద్ (Shabad) ఘటనపై పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం స్పందించి మాట్లాడితే.. ఇక్కడి సీఎం రేవంత్ రెడ్డి మాత్రం కనీసం నోరు మెదపకపోవడం సిగ్గుచేటని, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా కంట్రోల్ తప్పిందని హరీష్ రావు (Harish Rao) ఆరోపించారు.
Read Also: పాలిటిక్స్‌లోకి ఎన్టీఆర్.. క్లారిటీ ఇచ్చిన టీం
Follow Us On: X(Twitter)

