రేపు దేశ వ్యాప్తంగా సంతాప దినం.. కారణమిదే!

కలం, వెబ్ డెస్క్: ఖతార్ (Qatar) మాజీ అమీర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ (74) ఆదివారం కన్నుమూసినట్లు రాజ కుటుంబం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే రేపు దేశ వ్యాప్తంగా ఒక రోజు సంతాప దినం పాటిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విదేశీ మంత్రిత్వ శాఖ వివరాలు వెల్లడించింది.

అధికారిక కార్యక్రమాలు రద్దు..

షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ మరణం సందర్భంగా రేపు దేశంలో సంతాప దినం పాటించనున్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాను సగం వరకే ఎగురవేయాలని కేంద్రం ఆదేశించింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే అన్ని రకాల అధికారిక, వినోద కార్యక్రమాలు రద్దు చేస్తారు. భారత్ తరఫున సంతాపాన్ని ప్రకటించేందుకు గాను కేంద్ర పార్లమెంటరీ, మైనార్టీ వ్యవహారా శాఖ మంత్రి కిరణ్ రిజిజు త్వరలోనే ఖతార్ దేశానికి వెళ్లనున్నారు.

ఇంధన రంగంలో ఎనలేని సహకారం..

షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ ఖతార్ అమీర్ గా ఉన్నప్పుడు భారత్‌తో అత్యంత సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. మరీ ముఖ్యంగా దేశ ఇంధన భద్రతకు ఎనలేని సహకారం అందించారు. మరీ ముఖ్యంగా LNG సరఫరాలో ఆ దేశమే ప్రధాన వనరుగా నిలుస్తూ వచ్చింది. ఆయన పాలనలో భారత్–ఖతార్ మధ్య వాణిజ్యం, ప్రవాస భారతీయుల సంక్షేమం, పెట్టుబడులు గణనీయంగా వృద్ధి చెందాయి.

ముగ్గురు భార్యలు.. 24 మంది పిల్లలు..

షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీకి ముగ్గురు భార్యలు. 24 మంది సంతానం. అందులో ఒకరే ప్రస్తుత అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ. 300 మిలియన్ డాలర్లతో అత్యంత ధనవంతుడైన అమీర్‌గా గుర్తింపు పొందారు. ఆదాయంలో ఎక్కువ శాతం చమురు కంపెనీల నుంచే వస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>