బూజుపట్టిన రేషన్ బియ్యం.. గ్రామస్తులు ఆందోళన!

​కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం జిల్లా తిరుమలయపాలెం (Tirumalayapalem) మండలం మహమ్మదాపురం గ్రామపంచాయతీలో రేషన్ బియ్యం నాణ్యతపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రేషన్ దుకాణం ద్వారా సరఫరా అవుతున్న బియ్యం బూజుపట్టి ఉండటంతో తినడానికి వీల్లేకుండా ఉన్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై రేషన్ డీలర్‌ను నిలదీశారు. తనకు రేషన్ బియ్యం ఎలా అందాయో.. అలానే పంపిణీ చేస్తున్నామని, ఇందులో తమ తప్పేమీ లేదని సమాధానం ఇచ్చాడు.

​ప్రజలకు నాణ్యమైన సన్నబియ్యం అందిస్తున్నామని ప్రభుత్వం ఒకవైపు ప్రకటనలు చేస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉందని మహమ్మదాపురం వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాణ్యతలేని బియ్యం తిని అనారోగ్యాల పాలుకావాల్సి వస్తోందని మండిపడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, రేషన్ బియ్యాన్ని తనిఖీ చేయాలని డిమాండ్ చేశారు. నాణ్యమైన బియ్యం మాత్రమే ప్రజలకు అందేలా తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>