కలం, చండూరు (గట్టుప్పల్): నల్గొండ జిల్లా గట్టుప్పల్ (Gattuppal) మండలం అంతంపేట గ్రామంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. గొర్రెల కాపరి కొమ్ము సత్తయ్య (70) పాము కాటుకు గురై మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. సత్తయ్య గొర్రెలను మేపేందుకు పొలాలకు వెళ్లాడు. ఈ క్రమంలో గుర్తు తెలియని పాము కాటేయడంతో అస్వస్థతకు గురయ్యాడు. స్థానికులు వెంటనే మర్రిగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే సత్తయ్య మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

