100 కోట్ల క్లబ్‌లో ‘మా ఇంటి బంగారం’.. సమంత రియాక్షన్ వైరల్!

కలం, వెబ్ డెస్క్: సమంత (Samantha) ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘మా ఇంటి బంగారం’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఏకంగా 100 కోట్ల గ్రాస్ కలెక్షన్ల మైలురాయిని దాటి రికార్డు క్రియేట్ చేసింది. తెలుగు చిత్రసీమలో మహిళా ప్రధాన సినిమా ఈ స్థాయి వసూళ్లను సాధించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ అద్భుతమైన విజయంపై స్పందిస్తూ సమంత సోషల్ మీడియాలో క్యూట్ రియాక్షన్ ఇచ్చారు.

తన సినిమాపై ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎమోషనల్ అవుతూనే ఎంతో ముద్దుగా ఆమె పెట్టిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఘనతతో సమంత లేడీ సూపర్ స్టార్‌గా తన స్టామినాను మరోసారి నిరూపించుకున్నారు. అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>