కలం, వెబ్ డెస్క్: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై సీఎం చంద్రబాబు (CM Chandrababu) కీలక ప్రకటన చేశారు. “ఆపరేషన్ విజయవంతమైంది. పవన్ వేగంగా కోలుకుంటున్నారు. మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఫిజియోథెరపి చేయించుకోవాలన్నారు. ఆరు నెలల తరువాత.. మరోసారి పరీక్షలు చేసి ఆ తరువాత ఏం చేయాలనేది చెబుతారు. పవన్ కళ్యాణ్ నిరంతరం ప్రజల కోసమే ఆలోచించే వ్యక్తి. భారీ జనాల సమీకరణకు పెట్టింది పేరు. ప్రజల మధ్యకు వెళ్లినప్పుడు, తనను తాను పూర్తిగా మర్చిపోతారు” అన్నారు.
మంత్రులతో వచ్చి సీఎం పరామర్శ..
అంతకుముందు సీఎం చంద్రబాబు ముంబైలోని కోకిలాబెన్ ధీరూబాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పవన్ కళ్యాణ్‌ని పరామర్శించారు. మంత్రులు నారాయణ, అనగాని సత్యప్రసాద్ సహా పలువురితో కలిసి ఆసుపత్రికి వచ్చిన సీఎంకు మంత్రి నాదెండ్ల మనోహర్ స్వాగతం పలికారు. చికిత్స వివరాలు అడిగి తెలుసుకున్న సీఎం.. సుమారు రెండు గంటల పాటు అక్కడే ఉన్నారు.

