కలం, మంథని: దేశంలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు గౌరవం పొందడానికి ప్రధాన కారణం ఓటు హక్కేనని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ (Putta Madhukar) అన్నారు. ఆదివారం మంథని మున్సిపల్ పరిధిలోని అంబేద్కర్‌నగర్‌లో నిర్వహించిన ఓటరు నమోదు ప్రత్యేక సవరణ (SIR) కార్యక్రమంలో ఆయన ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా పుట్ట మధూకర్ మాట్లాడుతూ.. ఓటు హక్కు లేకపోతే బలహీన వర్గాల సమస్యలను ఎవరూ పట్టించుకోరని అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కృషి వల్లే దేశంలో ప్రతి పౌరుడికి ఓటు హక్కు లభించిందని గుర్తుచేశారు. ఓటు హక్కు ఉండటం వల్లే ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ సమాన గుర్తింపు లభిస్తోందని అన్నారు.
ఎస్ఐఆర్ ప్రక్రియ నియోజకవర్గంలో ఆశించిన స్థాయిలో సాగడం లేదని, అధికారుల లెక్కల ప్రకారం ఇప్పటివరకు కేవలం 25 నుంచి 30 శాతం వరకు మాత్రమే దరఖాస్తులు పూర్తయ్యాయని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ తమ పేరు ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని, ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా చూడాలని సూచించారు. బీఎల్వోలు, బీఎల్ఏలు సమన్వయంతో పనిచేయాలని, బీఆర్ఎస్ శ్రేణులు ప్రజలకు సహకరిస్తూ ఓటరు నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పుట్ట మధూకర్ (Putta Madhukar) పిలుపునిచ్చారు.
Read Also: నా ప్రశ్నించే స్వరం ఆగదు.. ప్రకాష్ రాజ్ ఫైర్
Follow Us On : WhatsApp

