కలం, వెబ్ డెస్క్: అమెరికాలో భారత సంతతికి చెందిన షీతల్ వ్రెజియన్ (Sheetal Wrzesien) దారుణ హత్యకు గురైంది. జార్జియా రాష్ట్రంలోని కాబ్ కౌంటీ పరిధి లారెల్ క్రీక్ ట్రెయిల్లో నివాసం ఉంటున్న షీతల్ను ఆమె భర్త కిర్క్ బి.వ్రెజియన్ తుపాకీతో కాల్చి చంపేశాడు. ఈ ఘటనలో వారి కుమారుడు జేసన్ కూడా తీవ్రంగా గాయపడినట్లు కాబ్ కౌంటీ పోలీసులు వెల్లడించారు. షీతల్ గూగుల్ మాజీ ఎగ్జిక్యూటీవ్ అధికారిణిగా పనిచేశారు.
ఆసుపత్రికి తరలించినా..
తుపాకీ శబ్దాలు విన్న ఇరుగు పొరుగు వారు పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బుల్లెట్ గాయాలతో అచేతనంగా పడి ఉన్న 57 ఏళ్ల షీతల్ను (Sheetal Wrzesien) వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ప్రకటించారు. కిర్క్ బి.వ్రెజియన్కు నేర చరిత్ర కలిగి ఉందని.. పలు చోట్ల కేసులు నమోదై ఉన్నాయని కాబ్ కౌంటీ పోలీసులు తెలిపారు.
వెంటనే నిందితుడి అరెస్ట్..
ఘటనా స్థలంలోనే నిందితుడు కిర్క్ బి.వ్రెజియన్ను పోలీసులు అరెస్ట్ చేసి అడల్ట్ డిటెన్షన్ సెంటర్కి తరలించి, విచారణ జరుపుతున్నారు. ‘నేను ఇదే ప్రాంతంలో 20 ఏళ్ల నుంచి ఉంటున్నాను. పెద్ద శబ్ధం వినిపించింది. కానీ, లోపల ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఎవరికైనా గుండెపోటు వచ్చిందేమో అనుకున్నాను. ఈ ఘటనతో ఒక్కసారిగా షాక్ అయ్యాను’ అని పొరుగింట్లో ఉండే జోవాన్ అండర్సన్ పేర్కొన్నారు.
Read Also: నా ప్రశ్నించే స్వరం ఆగదు.. ప్రకాష్ రాజ్ ఫైర్
Follow Us On: Instagram

