ఓటరు జాబితాపై నిరంజన్ రెడ్డి కీలక సూచనలు

కలం, వనపర్తి: ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియలో అర్హులైన ప్రతి ఒక్కరి పేరు తప్పకుండా నమోదు అయ్యేలా అధికారులు కృషి చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) సూచించారు. ఆదివారం వనపర్తి (Wanaparthy) మండలం చిట్యాల గ్రామ పంచాయతీ కార్యాలయంలో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా బీఎల్‌వోలతో మాట్లాడిన నిరంజన్ రెడ్డి, గ్రామాలలోని ప్రతి ఓటరిని ప్రత్యక్షంగా కలిసి నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించాలని సూచించారు. తుది ఓటరు జాబితాలో అర్హుల పేర్లు మిస్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. బీఆర్ఎస్ బీఎల్‌ఏలు, పార్టీ నాయకులు దరఖాస్తుల పూరణలో ప్రజలకు సహకరించాలని, కార్యక్రమంలో పాల్గొంటూనే స్థానిక సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గట్టు యాదవ్, వాకిటి శ్రీధర్, నందిమల్ల అశోక్, కె. మాణిక్యం, భాను ప్రకాశ్ రావు, సర్పంచ్ శోభా కృష్ణయ్య, రఘువర్ధన్ రెడ్డి, మాధవ్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, చిట్యాల రాములు, బీఎల్‌వోలు భాగ్యమ్మ, సుమిత్రమ్మ, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>