కలం, వెబ్ డెస్క్ : తమిళనాడు (Tamil Nadu)లోని కరూర్-కోయంబత్తూర్ జాతీయ రహదారి పక్కన ఉన్న కరుప్పంపాలయంలో ఘోర ప్రమాదం సంభవించింది. అక్కడ ఉన్న ఒక ప్రైవేట్ బస్సు బాడీ బిల్డింగ్ కంపెనీలో శనివారం భారీగా మంటలు చెలరేగాయి. ఈ అగ్నిప్రమాదం కారణంగా మూడు బస్సులతో పాటు బాడీ బిల్డింగ్ కోసం ఉపయోగించే నిర్మాణ సామగ్రి పూర్తిగా కాలి బూడిదయ్యాయి.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ప్రైవేట్ సంస్థ సెంథిల్ కుమార్ అనే వ్యక్తికి చెందినదిగా గుర్తించారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైర్ టెండర్లు, వాటర్ ట్యాంకర్లతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. సుమారు మూడు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో వర్క్‌షాప్ లోపల పార్క్ చేసి ఉన్న మూడు బస్సులు, బస్సుల తయారీకి ఉపయోగించే వివిధ రకాల విలువైన పరికరాలు మంటల్లో పూర్తిగా దగ్ధమయ్యాయి.

