కలం, నిర్మల్ : నిర్మల్ (Nirmal ) రూరల్ మండలం చిట్యాల్ గ్రామంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత నైపుణ్య శిక్షణ కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. ఫౌండేషన్ ప్రతినిధి ఎస్.కె. రసూల్ మాట్లాడుతూ.. హోటల్ మేనేజ్‌మెంట్, కంప్యూటర్, మల్టీ ఫంక్షనల్ ఆఫీస్ అసోసియేట్, ఫుడ్ అండ్ బేవరేజ్ సర్వీస్ తదితర రంగాల్లో ఉచిత శిక్షణ అందించనున్నట్లు తెలిపారు.
18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి, పదో తరగతి, ఇంటర్, డిగ్రీ పాస్ లేదా ఫెయిల్ అయిన నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకోవచ్చని ఎస్.కె. రసూల్ తెలిపారు. ఆసక్తి గల వారు 7997775451, 9959865645 మొబైల్ నంబర్లను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుప్రియ, ఉపసర్పంచ్ రమేష్, బీజేపీ మండల అధ్యక్షుడు వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

